Discount on Gold: రూ.4,400 డిస్కౌంట్ తో బంగారం.. ఎక్కడో తెలుసా..?
బంగారం రేటు ఈ స్థాయిలో దూసుకు పోతున్న నేపథ్యంలో స్వచ్చమైన బంగారంను మార్కెట్ రేటు కంటే రూ.4,400 లకు తక్కువగా కొనుగోలు చేసే అవకాశం రిజర్వ్ బ్యాంక్ కల్పిస్తోంది. ఆ వివరాలు
Rs 4,000 Discount on Gold: గత కొన్నాళ్లుగా బంగారం రేటు ప్రతి రోజు పెరుగుతూనే ఉంది. ఈమధ్య బంగారం రేటు స్థిరంగా అస్సలు ఉండటం లేదు. తాజాగా మరోసారి భారీగా బంగారం రేటు పెరిగింది. హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా కూడా బంగారం రేటు విపరీతంగా పెరగడంతో పాటు వాటిపై ట్యాక్స్ అంటూ పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. దాంతో సామాన్యులు బంగారం కొనుగోలు చేయడమే కష్టం అయ్యింది.
ప్రస్తుతం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు గాను రూ.57,200 కాగా, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు గాను రూ.62,400 గా ఉంది. బంగారం రేటు ఈ స్థాయిలో పెరుగుతుందని మార్కెట్ వర్గాల వారు కూడా కొన్ని సంవత్సరాలకి ముందు ఊహించనే లేదు అంటున్నారు. బంగారం రేటు 10 గ్రాములు లక్ష రూపాయల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు అంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సామాన్యులు బంగారం కొనుగోలు చేయలేక.. ముందుముందు కూడా కొనే పరిస్థితి లేదనే ఆవేదన వ్యక్తం అవుతోంది.
బంగారం రేటు ఈ స్థాయిలో దూసుకు పోతున్న నేపథ్యంలో స్వచ్చమైన బంగారంను మార్కెట్ రేటు కంటే రూ.4,400 లకు తక్కువగా కొనుగోలు చేసే అవకాశం రిజర్వ్ బ్యాంక్ కల్పిస్తోంది. షాప్స్ వారు తాము అంత శాతం తక్కువ ఇస్తున్నాం.. ఇంత శాతం తక్కువ ఇస్తున్నాం అంటూ ప్రకటనలు చేయడం మనం చూస్తూనే ఉంటాం.
కానీ రిజర్వ్ బ్యాంక్ తక్కువ రేటుకు బంగారం ఇవ్వడం ఏంటా అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడతల వారీగా సావరిన్ గోల్డ్ బాండ్స్ ని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారికి మార్కెట్ ధర కంటే రూ.4,400 తక్కువ రేటుకు దక్కుతుంది. సెకండరీ మార్కెట్ లో సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారు తమ వద్ద ఫిజికల్ బంగారం ఉన్నట్లుగానే భావించవచ్చు. మార్కెట్ లో బంగారం ధర ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో అలాగే ఈ బాండ్స్ లో కొనుగోలు చేసిన బంగారం రేటు కూడా పెరుగుతూనే ఉంటుంది.
Also Read: Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం
డీ మ్యాట్ అకౌంట్ ఉన్న వారు సెకండరీ మార్కెట్ లో సావరిన్ గోల్డ్ బాండ్స్ ను కొనుగోలు చేసేందుకు అర్హులు. గోల్డ్ బాండ్స్ ను ఎప్పుడు అమ్ముకున్నా కూడా స్వచ్చమైన గోల్డ్ ధర మార్కెట్ లో ఎంత ఉంటే అదే ధరను నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. సావరిన్ గోల్డ్ బాండ్ ఫిజికల్ గోల్డ్ కాదు.. పేపర్ గోల్డ్ అనే విషయం గుర్తించాలి. అయితే పేపర్ గోల్డ్ అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అమ్ముకునే సమయంలో ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ప్రయోజనం పొందవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ లో 24 క్యారెట్ స్వచ్చత లభిస్తుంది. ఎలాంటి మోసం కాని.. మధ్యవర్తులు కానీ ఈ బాండ్ కొనుగోలు చేసే విషయంలో ఉండరు.. కనుక అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో బంగారం ధర లక్ష రూపాయలు చేరే అవకాశం ఉందంటున్నారు కనుక గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ అన్ని విధాలుగా ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read: Team India Head Coach MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. హింట్ ఇచ్చిన సునీల్ గవాస్కర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook